Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుటుంబ సమేతంగా లండన్ కు వెళ్తున్న జగన్

Jagan going to London
Advertisement
  • లండన్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తె
  • కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తున్న జగన్ దంపతులు
  • ఈ నెల 21న బయల్దేరే అవకాశం
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి లండన్ వెళ్తున్నారు. తన భార్య భారతితో కలిసి ఆయన లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. జగన్ కుమార్తె లండన్ లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జగన్ దంపతులు తన కుమార్తె వద్దకు లండన్ కు వెళ్తుంటారు. 

ఈ నెల 21న జగన్ దంపతులు లండన్ కు బయల్దేరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరు లండన్ లో గడపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది. గత ఏడాది జగన్ కూతురు డిగ్రీ పట్టా పొందారు. ఆ సందర్భంగా జగన్, భారతి లండన్ కు వెళ్లారు. 2019 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో జగన్ లండన్ వెళుతున్నారు. 
Advertisement
Advertisement
Jagan
YSRCP
London

More Telugu News